Ads Top

ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేసిన కేసీఆర్‌


తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టీడీపీలో చాలా యేళ్లుగా క‌లిసి ప‌నిచేశారు. వారిద్ద‌రిది మంచి స్నేహబంధం. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు చాలాసార్లు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకున్నా వ్య‌క్తిగ‌తంగా మాత్రం చాలా స్నేహంగా ఉంటారు. తాజాగా భేటీ అయిన వీరిద్ద‌రు పాత స్నేహాన్ని, స్ముతుల‌ను గుర్తు చేసుకున్నారు.
నర్సింహులు ఏకైక కుమార్తె డాక్టర్‌ నీహారిక వివాహం ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వివాహానికి రావాల‌ని మోత్కుప‌ల్లి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఇందుకోసం ఆయ‌న కేసీఆర్ నివాసానికి వెళ్లారు. వీరిద్ద‌రు రాజ‌కీయ అంశాల‌ను ప‌క్క‌న పెట్టి చాలా సేపు చ‌ర్చించుకున్నారు. పెళ్లికి తప్పక రావాలని మోత్కుపల్లి కోరగా.. వస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.
ఇక చాలా రోజుల త‌ర్వాత భేటీ అయిన వీరి మ‌ధ్య పాత విష‌యాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయ‌ట‌. ఎన్టీఆర్ టీడీపీ పెట్టి మ‌న‌లాంటి ఎంతోమందికి రాజ‌కీయ ప్ర‌వేశానికి అవ‌కాశం క‌ల్పించార‌ని మోత్కుప‌ల్లి అన‌గా…అందుకే కేసీఆర్ కూడా అంగీక‌రించారట‌. ఎన్టీఆర్ గొప్ప వ్య‌క్తి అన్న విష‌యం కాద‌ద‌న‌లేని స‌త్యం అని కేసీఆర్ అన్నారు.
రిక్షా తొక్కేవాళ్ల‌కు రెండు జ‌త‌ల డ్ర‌స్సులు ఇవ్వాల‌ని మ‌నిద్ద‌రం వెళ్లి అడ‌గ‌గానే వెంట‌నే అంగీక‌రించిన విష‌యాన్ని మోత్కుప‌ల్లి చెప్పిన వెంట‌నే కేసీఆర్ న‌ర్స‌న్నా నీకు అన్ని బాగానే గుర్తున్నాయే అని అన్నారు. ఇక ఉద్య‌మ స‌మ‌యంలో విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా చంద్ర‌బాబు మీద త‌న‌కు వ్య‌క్తిగ‌త వైరుధ్యం లేద‌ని మోత్కుప‌ల్లితో అన్నారు.

No comments:

Powered by Blogger.