Ads Top

మోడీ .. నీకు ఆ దమ్ముందా ?

మోడీ .. నీకు ఆ దమ్ముందా ?

బీజేపీ నేతలు , మోడీ భజన రాయుళ్ళు సామాన్యుల మీద భలే సీరియస్ అవుతున్నారు. సినిమా టికెట్ ల కొసం క్రికెట్ మ్యాచ్ ల కోసం గంటల తరబడి క్యూ లో నుంచోవడం అంటే తేలికైన విషయంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. దేశం కోసం ఒక రెండు గంటలు కూర్చోమంటే మీ నొప్పెంటి అంటూ మొఖం మీదనే అడిగేస్తున్నారు వారు. క్యూ లో వెయిట్ చేస్తున్న వారు తమ ఇబ్బందులు ఏవో తాము పడుతూనే ఫాస్ట్ ఫాస్ట్ గా లైన్ లు లాగిస్తున్నారు. కానీ ఒక పక్క లైన్ లలో నిలబడి తూలిపోయి చచ్చిపోతున్న వారు ఎక్కువయ్యారు అంతే కాకుండా నోట్లు చెల్లవు అనే పుకార్లు నమ్ము, దావఖానా లో నోట్లు చెల్లక ఆత్మహత్య చేసుకుంటున్న వారి లిస్టు పెరిగిపోయింది.

ఒక్క నిర్దోషి కి కూడా శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగ , న్యాయ వ్యవస్థ యొక్క మొట్ట మొదటి సిద్దాంతం కానీ ఇక్కడ నష్టపోతోంది మాత్రం ఖచ్చితంగా నిర్దోషె , ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో కూడా తెలియని ఆ బ్లాక్ మనీ హోల్డర్ గురించి ఒక అమాయకుడు తన ప్రాణాన్ని సైతం రిస్క్ లో పెట్టడం అంటే పెద్ద విషయమే మరి.

మోడీ గారి తల్లి ని కూడా రంగంలోకి దింపి పాలిటిక్స్ చేయించారు అనే ఒక అపవాదు ఉండనే ఉంది. నోట్ల రద్దు విషయం గొప్పదా కాదా అనే సంగతి డిసెంబర్ నెలాఖర్లో వరకూ మాట్లాడలేం. సామాన్య కష్టాల గురించి మోడీ ప్రభుత్వం అవగాహన చేసి ఆలోచించలేక పోయింది అనేది మాత్రం నగ్న సత్యం. వారు కాస్త ముందు చూపు ఉంచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది మరి. గ్రామాల్లో వృద్ధులు, రోగులు, పొట్టకూటి కూలీలూ అందరూ ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది కాబట్టి ఆ కష్టాలు భరించాలి అనే అనుకుందాం. కానీ ఆ నమ్మకాన్ని మోడీ ఎక్కడ ఇస్తున్నాడు? అవినీతి మీద ఉక్కు పాదం మోపుతా , సామాన్యుడి ని ప్రశాంతంగా నిద్ర పోయేలా చేస్తా అంటూ చెబుతున్న మోడీ నల్ల కుబేరుల కి నిద్ర పట్టేలా చెయ్యడం లేదు అంటున్నారు. కానీ అది నిజంలోకి వచ్చే సరికి ఎక్కడా నిజంగా కనపడట్లేదు. సుష్మా స్వరాజ్‌కి దత్త పుత్రుడి లాంటి గాలివారు బిజెపికి నల్ల రాకాసురుడిలా కనిపించడం లేదేమో కానీ ప్రజలకు మాత్రం టాప్ మోస్ట్ నల్ల రాకాసురుడిలాగే కనిపిస్తున్నాడు. నోట్ల రద్దుతో సామాన్యులేమో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న వార్తలు వినిపిస్తూ ఉంటే..మరోవైపు ఈ నల్ల రాకాసురుడివారి ఇంట పెళ్ళి వైభోగం మాత్రం కళ్ళు భైర్లు కమ్మేలా చేస్తోంది. పెళ్ళి కూతురి చీర 17 కోట్లట. నగలు 90 కోట్లట..ఇక మిగతా వివరాలు కూడా తెలుసుకుంటే గుండె ఆగిపోవడం ఖాయం.

బీజేపీ నాయకులని అమిత్ షా ఈ పెళ్ళికి వెళ్ళద్దు అంటున్నా కూడా ముఖ్యమంత్రి స్థాయి నాయకులు హాజరు అవ్వబోతున్నారు. మోడీ ప్రధాని అయ్యి రెండేళ్ళ పైగా గడిచినా ఒక నల్ల రాక్షసుడిని ఇంత చీప్ గా వదిలెయ్యడం దారుణమైన విషయం. మరొక నల్ల కుబేరుడు విజయ్ మాల్యా లండన్ చెక్కేసి తనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనేలా ప్రవర్తిస్తున్నాడు. చెప్పడానికి మాత్రం నల్ల రాకసురుల గుండెల్లో నిద్ర పోతా , వారికి నిద్ర లేకుండా చేస్తా అంటూ కహానీలు చెబుతున్న మోడీ గారికి వీరిద్దరినీ కనీసం గాలి లాంటి వారిని , వారింట్లో పెళ్లి నీ అడ్డుకునే దమ్ముందా ? ఈ దేశం లో బ్లాక్ మనీ ఉన్న వారు ఎవ్వరూ సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు అని చెప్పే మోడీ కి గాలి వారింట్లో పెళ్లి కనపడ్డం లేదా ? నోట్ల రద్దు నిర్ణయానికి ధైర్యం అవసరం లేదు.

విదేశాల్లో నల్ల ధనం దాచుకున్న రాకాసురులనో, సహజ వనరులు, ప్రజల ఆస్థులను దర్జాగా దోచుకుని.ఆ నల్లధనంతో వాళ్ళ రాజవైభోగాన్ని తిరిగి ఆ ప్రజలకే ప్రదర్శిస్తూ.జనాల గుండెల్లో మంటలు వేస్తున్నారు మోడీ జీ జర ఇటువైపు చూడండి .

No comments:

Powered by Blogger.