Ads Top

గౌతమిపుత్ర’ కోసం 18 గంటలు… ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌



గమ్యం, కృష్ణం వందే జగద్గురుమ్‌, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి… ఈ సినిమాల వెనుక దర్శకుడు క్రిష్‌తోపాటు వినిపించే మరో పేరు వాటి నిర్మాతల్లో ఒకరైన రాజీవ్‌ రెడ్డి ఎడుగూరు. వీరిద్దరి మధ్య దర్శకుడు-నిర్మాత బంధమే కాదు, స్నేహబంధం కూడా ఉంది. ‘నేను సినిమాల్లోకి రావడానికి కారణం క్రిష్‌. అతడు సినిమాల్లోకి రాకపోయుంటే నేనూ ఇటువైపు వచ్చేవాణ్ని కాదు’ అంటున్న రాజీవ్‌, తన సినిమా ప్రస్థానం గురించి చెబుతున్నారిలా…

క్రిష్‌, నేనూ అమెరికాలో ఒకే యూనివర్సిటీలో ఎం.ఎస్‌. కంప్యూటర్స్‌ చేయడానికి వెళ్లాం. మా పరిచయం అక్కడే. మేం క్లాస్‌మేట్స్‌ కూడా. ఆర్నెల్లకు రూమ్మేట్స్‌గానూ మారిపోయాం. చదువుకుంటూనే బయట పెట్రోలు బంకులో, రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసేవాళ్లం. అర్ధరాత్రి తర్వాత ఖాళీ దొరికితే ఫోన్లో అసైన్‌మెంట్‌ల గురించి చర్చించుకునేవాళ్లం. తెల్లారాక రూమ్‌కి వచ్చి మూడు నాలుగు గంటలు నిద్రపోయి క్లాసులకి వెళ్లేవాళ్లం. క్లాసులు మధ్యాహ్నం రెండు నుంచి ఉండేవి. సోమవారం నుంచి శుక్రవారం వరకూ చదువూ, పార్ట్‌టైమ్‌ జాబ్‌లతో ఖాళీ ఉండేది కాదు. వారాంతాల్లో మాత్రం బైక్‌ ట్రిప్స్‌, పార్టీలతో సరదాగా గడిపేవాళ్లం. మా అపార్ట్‌మెంట్‌లో నలుగురం ఉండేవాళ్లం. వీకెండ్‌ వచ్చిందంటే ఆ సంఖ్య అయిదారు రెట్లు పెరిగేది.

వ్యాపార భాగస్వామ్యం

ఎం.ఎస్‌. పూర్తయ్యాక క్రిష్‌ ఇండియా వచ్చేశాడు. నేనక్కడే ఉండి ఆర్నెల్లు ఉద్యోగం చేశాను. తర్వాత ఇక్కడే ఏదైనా చేద్దామని నేనూ వచ్చేశాను. క్రిష్‌ అమెరికా నుంచి వచ్చాక ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’ పేరుతో ఓ కంపెనీ పెట్టాడు. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు గైడెన్స్‌ ఇచ్చే కన్సల్టెన్సీ సంస్థ అది. క్రిష్‌తో ఉన్న స్నేహం కారణంగా ఇక్కడికి వచ్చాక అతడితోపాటు ఫస్ట్‌ కౌన్సిల్‌ నిర్వహణను చూసేవాణ్ని. తర్వాత ఆర్నెల్లకు ఓ ఐటీ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం వస్తే చేరాను. ఏడాదిపాటు అక్కడ పనిచేశాక ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’ని ఇద్దరమూ నిర్వహిద్దామని చెప్పి క్రిష్‌ నన్ను తిరిగి పిలిచాడు. కాకపోతే రోజువారీ పర్యవేక్షణ నన్ను చూడమన్నాడు. అందుకు కారణం, క్రిష్‌ సినిమాల్లోకి వెళ్లదలుచుకోవడమే. ఉద్యోగంలో చేరాక నాకు పెళ్లి కుదిరింది. తర్వాత నెల గడువులోనే క్రిష్‌ నుంచి పిలుపు. అమ్మానాన్నలకి విషయం చెబితే నిర్ణయాన్ని నాకే వదిలేశారు. కానీ కాబోయే అత్తమామల్ని ఎలా ఒప్పించాలా అని సందేహించాను. పరిస్థితిని వివరించాక వాళ్లూ అభ్యంతరం చెప్పలేదు. దాంతో ఉద్యోగం విడిచిపెట్టి భాగస్వామిగా ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’కి తిరిగి వచ్చాను. ఆ తర్వాత క్రిష్‌ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అతడు సినిమా ప్రయత్నాలు చేస్తుంటే దాదాపు నాలుగైదేళ్లు కంపెనీని ముందుకు నడిపాను. మేమిద్దరం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సాయపడిందా సంస్థ.

‘గమ్యం’తో తొలి అడుగు

2008లో ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’ ద్వారా మేం సంపాదించిన మొత్తానికితోడు క్రిష్‌ వాళ్ల నాన్నగారు సాయిబాబు కొంత మొత్తం ఇవ్వడంతో ‘ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టెయిన్మెంట్స్‌’ బ్యానర్‌ స్థాపించి సినిమా నిర్మాణం మొదలుపెట్టాం. అప్పటికి క్రిష్‌ ఒక సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశాడు. సినిమా నిర్మాణం రిస్కు అన్న భయం ఓ పక్క ఉండేది. ‘నాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి. డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే సరే లేదంటే నేనూ వెనక్కి వచ్చేస్తాను. అప్పుడు ఇద్దరం కలిసి కంపెనీని ముందుకు నడిపిద్దాం’ అని చెప్పాడు క్రిష్‌. ఆ సినిమానే ‘గమ్యం’. గమ్యంతో క్రిష్‌ తనను తాను దర్శకుడిగా నిరూపించుకున్నాడు. ఆ సినిమా నిర్మాణ పనుల్లో నేను పూర్తిగా భాగం కాలేదు. అప్పటికి ఫస్ట్‌ కౌన్సిల్‌నే చూసేవాణ్ని. మాకు ఆదాయం వస్తున్నది అక్కణ్నుంచే కదా, దాన్ని నిర్లక్ష్యం చేయదల్చుకోలేదు. ఆ సమయంలో సాయిబాబు గారు రోజువారీ నిర్మాణ బాధ్యతలు చూసేవారు. నేను డబ్బు సర్దుబాటు చేయడం, ఖర్చుల లెక్కలు చూసుకోవడం లాంటివి చేసేవాణ్ని. ‘గమ్యం’ హిట్‌ కావడంతో మాకు ధైర్యం వచ్చింది. ఆ సినిమాతో దర్శకుడిగా క్రిష్‌కీ, బ్యానర్‌గా ‘ఫస్ట్‌ ఫ్రేమ్‌…’కీ మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో మాకు ఫిల్మ్‌ఫేర్‌, నంది అవార్డులూ వచ్చాయి. అప్పుడే సీరియల్‌ చేయమని ‘ఈటీవీ’ నుంచి మాకు పిలుపు వచ్చింది. నిర్మాణ విభాగంలోకి నేను పూర్తిగా అడుగుపెట్టింది అప్పుడే. ఈటీవీ ప్రోత్సాహంతో మేం తీసిన సీరియల్‌… ‘పుత్తడి బొమ్మ’. ఆ సీరియల్‌ నాలుగేళ్లు ప్రసారమైంది. ఆ సీరియల్‌కు మాకు నంది అవార్డు కూడా వచ్చింది.

ఉషాకిరణ్‌ మూవీస్‌తో…

మా బ్యానర్‌లో వచ్చిన రెండో సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’. ఈసారి నిర్మాణ బాధ్యతలు నేను చూసుకున్నాను. ఆ సినిమాకి అనుకున్నదానికంటే చాలా ఎక్కువ ఖర్చయింది. నా అనుభవలేమి కూడా అందుకో కారణమని చెప్పాలి. నేను ఖర్చుల్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాను. ఆ సినిమాతో మేం ఆర్థికంగా నష్టపోలేదు కానీ, కొన్ని పొరపాట్లు చేయకుంటే, లాభాల్ని సంపాదించేవాళ్లం. కానీ మంచి సినిమా తీశామన్న సంతృప్తి మాత్రం ఉంది. ‘కృష్ణం వం

No comments:

Powered by Blogger.