ప్రభాస్ ద్రుష్టి అక్కడ పెట్టాడు…
బాహుబలి సంచలన విజయం తర్వాత బాహుబలి2 సినిమలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకోసం తన కెరీర్లో మూడేళ్ళ సినీ జీవితాన్ని త్యాగం చేసిన ప్రభాస్ బాహుబలి తర్వాత తన తదుపరి సినిమాలపై పూర్తి ద్రుష్టి పెట్టాడు. ప్రభాస్ తర్వాతి సినిమా రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
బాహుబలి తర్వాత వచ్చే సినిమా కావడంతో ఆ స్థాయిలోనే భారీ బడ్జెట్ తో , భారీ సాంకేతిక నైపుణ్యంతో తెరకేకిన్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ నేతృత్వం లో స్టంట్స్ ఉంటాయని, యాక్షన్ ఎపిసోడ్‌లన్నీ దుబాయ్, గల్ఫ్ దేశాల్లో జరుగుతాయని తెలిసింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రారంభం కానున్నదట. యు.వి క్రియేషన్స్ పతాకంపై నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్ ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట.

No comments: