తారక్ పై కుష్భు అభిమానం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సిని హీరోలు, హీరోయిన్స్ లో కూడ ఎన్టీఆర్ ను అభిమానించే వాళ్లు ఉన్నారు.
అయితేఎన్టీఆర్ అభిమానుల ఖాతాలో కుష్భు ముందు వరుసలో ఉంటుంది. హీరోయిన్ కుష్బూ తారక్ పై ఉన్న అభిమానాన్ని బహిరంగంగా చాటుకుంది. ట్వీట్టర్ లో ఒక తారక్ అభిమాని కుష్భును మా హీరో తారక్ గురించి ఒక్క మాట చెప్పండి అని అడిగాడు. దీనికి కుష్భు ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. ప్లీజ్ తారక్ మీ హీరోనే కాదు మన హీరో అని చెప్పండి అని సమాధానం చెప్పింది.
కుష్భు ఒక్క ట్వీట్ తో తారక్ అభిమానులను కుషీ చేసింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్న కుష్భు మరోసారి తన అభిమానాన్ని తెలియజేసింది.

No comments: