Ads Top

ఎన్టీఆర్ ని అందుకోలేకపోయిన మెగా హీరో


ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిగిలిన హీరోల కన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నాడు…ఎన్టీఆర్ కి ఇన్నాళ్ళు సరైన రికార్డులు లేవన్న వాళ్ళ నోళ్ళు మూయిస్తూ జనతాగ్యారేజ్ తో అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ క్రేజ్ కి టోటల్ టాలీవుడ్ సలాం చేస్తుంది. కాగా ఇక్కడ ఎలాంటి క్రేజ్ ఉందొ పక్క రాష్ట్రంలోను అలాంటి క్రేజ్ ఉండటం విశేషం…కానీ ఇక్కడికంటే కూడా ఎన్టీఆర్ కి పక్క రాష్ట్రం కర్ణాటకలో సూపర్ క్రేజ్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ కి క్రేజ్ రాకముందే అక్కడ పాగా వేసిన మెగా హీరోలు ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టిన బెంచ్ మార్కులను అందుకోలేకపోతున్నారు.


జనతాగ్యారేజ్ కి అక్కడ జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 7.4 కోట్లు…ఇది టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఆల్ టైం టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ లలో ఒకటి. జనతాగ్యారేజ్ హ్యూమ౦గస్ హిట్ తరువాత వస్తున్న మెగా హీరో రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవకి అక్కడ 3 కోట్లకు మించి ఆఫర్స్ రావడం లేదని సమాచారం.

అక్కడ మెగా హీరోల్లో ఈ మధ్య క్లీన్ హిట్ కొట్టిన హీరో లేకపోవడం అందునా రామ్ చరణ్ పెద్దగా ఫామ్ లో లేకపోవంతో అంతకుమించి ఇవ్వడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.

No comments:

Powered by Blogger.