Ads Top

రజనీ 2.0 ఫస్ట్‌ లుక్‌ ఇదే…


ముంబై: రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లోని భారీ చిత్రం 2.0 ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. కబాలి విజయంతో మంచి ఫాంలో ఉన్న రజనీ హీరోగా, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున‍్నాయి. అందుకు తగ్గట్లే.. రజనీ, అక్షయ్‌ కుమార్‌ నువ్వానేనా అ‍న్నట్లు ఎదురెదురుగా కనబడుతున్న ఫస్ట్‌లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆదివారం ముంబైలోని యష్ రాజ్ ఫిలిం స్టూడియోలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో ఫస్ట్‌ లుక్ ను చిత్ర యూనిట్‌ లాంచ్‌ చేసింది.

ఈ చిత్రంలో రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. రోబో చిత్రానికి సీక్వల్ గా రూపొందుతున్న ఈ సినిమాను 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.


No comments:

Powered by Blogger.