బ్రేకింగ్ న్యూస్..బాలయ్య 101 బోయపాటితోనే చేస్తాడంట..!!
నందమూరి బాలక్రిష్ణ తాజాగా గౌతమి పుత్ర శాతకర్ఙి షూటింగ్ లో పాల్గొనటమే కాదు ఆల్ రెడీ ఫైనల్ పార్ట్ ను కూడ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు శాతకర్ణి రిలీజ్ పై వెయిట్ చేస్తున్నాడు.అయితే 101 సినిమా ఎవరితో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.రైతు సినిమా కృష్ణవంశీతో చేస్తాడన్న టాక్ నడుస్తున్నా..మరో సంచలన విషయం బయటకి వచ్చింది.
బాలయ్య తన 101వ ప్రాజెక్ట్ ను కృష్ణవంశీ చేపడుతున్నట్లు గతంలో చెప్పారు. కానీ వంశీ మౌల్డ్ చేసే స్టోరీకి బాలయ్య లేటెస్ట్ గా కనెక్ట్ కాలేకపోతున్నాడనే టాక్ టాలీవుడ్ లో బలం గా నడుస్తుంది.దీంతో మళ్లీ బాలయ్య కోసమే రాసుకున్న ఒక పవర్ ఫుల్ సోషల్ సబ్జెక్ట్ తో హ్యాట్రిక్ కొట్టడానికి బోయపాటి రెడీ అయిపోతున్నట్లు సినీ వర్గాల ద్వారా మనకు అందుతున్న లేటెస్ట్ సమాచారం. అయితే బెల్లంకొండ కొడుకు ప్రాజెక్ట్ ను వేగంగా కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నాడంట శీను. బాలయ్య 100వ సినిమాను బోయపాటే డైరెక్ట్ చేస్తాడని ఆల్మోస్ట్ అంతా ఫిక్స్ అయిపోయారు అప్పట్లో. అయితే ఈసారి ఎలాగైనా ఈ కాంబో సెట్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు సినీ క్రిటిక్స్.

No comments: