ఎన్టీఆర్-పవన్‌లు కలుసుకున్నారట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌ల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయో చాలా మందికి తెలియదు కానీ ఆ మధ్య అభిమానుల మధ్య గొడవలో మాత్రం ఓ అభిమాని చనిపోయాడు. అయితే ఇద్దరు హీరోలు కూడా వెంటనే ఆ సంఘటనను ఖండించారు. అంతకుముందు రామ్ చరణ్ వివాహ సమయంలో ఎన్టీఆర్, పవన్‌లు ప్రత్యేకంగా మాట్లాడుకున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఎప్పుడైనా కలిశారా? మాట్లాడుకున్నారా? అనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. అయితే తాజాగా మాత్రం ఓ విషయం ఫిల్మ్ నగర్‌లో సర్క్యులేట్ అవుతోంది.
ఎన్టీఆర్-పవన్‌లు కలుసుకున్నారట. అయితే అది కలుసుకోవాలన్న ఉద్ధేశ్యంతో జరిగిన సంఘటన కాదు. ఇప్పుడు పవన్ సినిమా, ఎన్టీఆర్ చేయబోయే రెండో సినిమాకు దర్శకుడు త్రివిక్రమే అన్న విషయం తెలిసిందేగా.
ఎన్టీఆర్ ఆఫీసుకు.ఎన్టీఆర్తో మాట్లాడాలన్న ఉద్ధేశ్యంతో పవన్, త్రివిక్రమ్‌లు వచ్చారట.
పవన్‌ని చూసిన ఎన్టీఆర్ కూడా పవన్‌తో కాసేపు సరదాగా మాట్లాడాడాట. ఇద్దరూ కూడా చాలా సేపు ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌లు ఏం మాట్లాడుకున్నారు? ప్రి ప్లాన్డ్ మీటింగా? లేక యాక్సిడెంటల్‌గా కలిశారా? కేవలం సినిమా విషయాలే చర్చించారా? లేక రాజకీయాలు కూడా మాట్లాడుకున్నారా? అనే టాపిక్కే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్‌గా నడుస్తోంది. ఏమై ఉంటుందబ్బా?

No comments: