Ads Top

ఆ విషయంలో మహేష్ మోసం చేశాడా?


మహేష్ మోసం చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ మహేష్ ఏ విషయంలో మోసం చేశాడని ఆలోచిస్తున్నారా? ఆ వివరాల్లోకి వెళితే.....మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమా ఘోర పరాజయం అయిన సంగతి తెలిసిందే. పివిపి బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమా భారీ బిజినెస్ చేశారు. ఆ సినిమా హక్కులను తీసుకున్న బయ్యర్లు భారీ నష్టాన్ని అందుకున్నారు. ఎంత నష్టమో తెలుసా దాదాపు 35 కోట్ల వారలు లాస్ అయ్యారు.

ఈ విషయాన్నీ పివిపి వారిని అడిగితె వారి నష్టాన్ని పూడ్చడానికి పివిపి, మహేష్ కొంత మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. కానీ ఆ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదట. మరో వైపు పివిపి తాను తీసిన ”కాష్మోరా” హక్కులు ఇస్తానని చెప్పాడు … అవి ఇవ్వలేదు, అలాగే మహేష్ – వంశీ పైడిపల్లి సినిమా హక్కులు కూడా ఇస్తామని అన్నారట. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియని బయ్యర్స్ … మాకు న్యాయం చేయాలనీ ఛాంబర్ కు పిర్యాదు చేస్తామని అంటున్నారు ? మరి ఈ విషయం పై మహేష్ స్పందిస్తాడో లేదో చూడాలి ?


No comments:

Powered by Blogger.