ఇక థియేటర్లలో చెల్లుబాటు కానున్న పాతనోట్లు
ప్రధానమంత్రి నరేంద్రమోడి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సినిమా రంగంపై భారీ ప్రభావం పడింది. చాలా సినిమాలు విడుదల తేది ప్రకటించినా...కానీ, విడుదలకు జంకుతున్నారు. కనీసం పెట్టుబడిన వస్తుందో? లేదో? అనే అనుమానం వారిలో వ్యక్తం అవుతుంది. తెలుగులో చాలా సినిమాలు విడుదల ప్రశ్నార్ధకంగా మారింది.
విడుదల కావాల్సిన సినిమాల పరిస్థితి ఇది. మరి ఇప్పటికే వచ్చిన సినిమాల సంగతి ఏంటి? జనం లేక వెక్కిరిస్తున్న థియేటర్లను చూసి నిర్మాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి అధిగమించడానికి కన్నడ పరిశ్రమ కంకణం కట్టింది. శాండిల్ వుడ్ సినీ ప్రేమికులకి ఇది తీపికబురు. నవంబర్ 30 వరకు అన్ని సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో పాత నోట్లని తీసుకుంటున్నట్లు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది.
కానీ 90 రూపాయల టికెట్ తీసుకొని 410 రూపాయల చిల్లర కోసం ఇబ్బంది పెట్టొద్దని యాజమాన్యాలు సూచించాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నాలుగైదు టికెట్స్ తీసుకుంటే పాత నోట్లను తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. డిస్ట్రిబ్యూటర్ మునిరాజు మాట్లాడుతూ డిసెంబర్ 30వరకూ నోట్లను మార్చుకునే అవకాశం ఉండటంతో పాత నోట్లు తీసుకోవాలనే నిర్ణయానికొచ్చినట్లు చెప్పారు.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్‌బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.

No comments: